‘బ్రహ్మా ఆనందం’ టీజర్ విడుదల...
- January 16, 2025
నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ లు వెండితెరపై తాత, మనవడిగా సందడి చేయనున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ పేరుతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆర్.వి.ఎస్ నిఖిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలను పోషించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం 53 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.
వెన్నెల కిశోర్, గౌతమ్‌ల కామెడీ అదిరిపోయింది. బ్రహ్మానందం ఎంట్రీతో పాటు ఆయన సీన్స్ బాగున్నాయి. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







