'దుబాయ్ చాక్లెట్' విక్రయాలపై జర్మన్ కోర్టు నిషేధం..!!
- January 16, 2025
యూఏఈ: ఎమిరేట్స్ వెలుపల తయారు చేయబడిన "దుబాయ్ చాక్లెట్" వెర్షన్‌ను విక్రయించకుండా ఒక డిస్కౌంట్ సూపర్ మార్కెట్ చైన్ ను జర్మన్ కోర్టు ఆదేశించింది. పిస్తా పేస్ట్, సన్నని పేస్ట్రీతో కూడిన దుబాయ్ చాక్లెట్.. TikTok వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ గా మారింది. ఈ చాక్లెట్ బార్లు గత సంవత్సరం విపరీతంగా అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో వందల యూరోలకు రీ సేల్ అవ్వడం విశేషం. గల్ఫ్ నగరం నుండే "దుబాయ్ చాక్లెట్"ని దిగుమతి చేసుకునే వ్యాపారవేత్త ఆండ్రియాస్ విల్మర్స్ చేసిన ఫిర్యాదును అనుసరించి కొలోన్ కోర్టు తీర్పును వెలువరించింది. అతను సూపర్ మార్కెట్ చైన్ ఆల్డి స్యూడ్ స్టాకింగ్ "అలియన్ దుబాయ్ హ్యాండ్‌మేడ్ చాక్లెట్" గురించి కోర్టుకు ఫిర్యాదు చేశాడు. ఇది వాస్తవానికి టర్కీలో ఉత్పత్తి అవుతుందని తెలిపారు. కానీ, చాక్లెట్ దుబాయ్‌లో తయారు చేయబడిందని అర్థం వచ్చేలా దాని పేరును దుర్వినియోగం చేస్తూ వినియోగదారుల సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నారని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఈ సందర్భంగా వివిధ అనుకరణ ఉత్పత్తులపై ఫోకస్ చేయాలని అధికారులను ఆదేశించింది. "వాస్తవానికి టర్కీలో భారీగా ఉత్పత్తి చేయబడిన చాక్లెట్ బార్లో 'దుబాయ్ హ్యాండ్‌మేడ్ చాక్లెట్' కనిపిస్తే, అది ఆమోదయోగ్యం కాదని పిటిషన్ దారుడు కోర్టు వెలుపల విల్మర్స్ తెలిపాడు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







