సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు నిందితుడు అరెస్ట్
- January 17, 2025
ముంబై: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై బాంద్రా పోలీసులు అతన్ని అరెస్టు చేయగా.. ప్రస్తుతం నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు.. దాడి జరిగిన 33 గంటల్లోనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. దొంతగనానికి వెళ్లాడా.. సైఫ్ పై దాడి చేయడానికే వెళ్లాడా.. ఎవరైనా సఫారీ ఇచ్చారా.. ఏదైనా కుట్రకోణం ఉందా.. ఎప్పుడు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు అనే విషయాలపై నిందితుడు నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలో సైఫ్ లీలావతి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే, నిందితుడు పరారయ్యాడు. సైఫ్ పై దాడి ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో నిందితుడు మెట్లు దిగి వెళ్తున్నట్లు సీసీటీవీ పుటేజీలో కనిపించింది. బ్యాగ్ తగిలించుకుని, స్కార్ఫ్ భుజంపై వేసుకొని కనిపించాడు. నిందితుడి ఫొటోలనుసైతం పోలీసులు విడుదల చేశారు. దుండగుడిని పట్టుకునేందుకు 20 పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుఝామున అనుమానితుడు కనిపించాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రైల్వే స్టేషన్ పరిసరాలతో పాటు.. ఇతర ప్రాంతాల్లో రాత్రి మొత్తం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం నిందితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం అతన్ని బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన దృశ్యాలు కనిపించాయి. అయితే, పోలీసులు అతనే సైఫ్ పై దాడి చేసిన నిందితుడని ఎలాంటి ప్రకటన చేయలేదు. విచారణ పూర్తయిన తరువాత పూర్తి వివరాలను మీడియాకు ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







