జనవరి 31 నుండి సాలిక్ వేరియబుల్ టోల్ రేట్లు ప్రారంభం..!!
- January 18, 2025
దుబాయ్: దుబాయ్‌లో సాలిక్ వేరియబుల్ రోడ్ టోల్ ధర ఈ ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. వారపు రోజులలో ఉదయం పీక్ అవర్స్ (ఉదయం 6 నుండి 10 గంటల వరకు), సాయంత్రం పీక్ అవర్స్ (సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు) లో టోల్ 6 దిర్హామ్‌లుగా ఉంటుంది. రద్దీ లేని సమయాలలో అంటే ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల మధ్య, రాత్రి 8 నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు టోల్ రేట్ 4 దిర్హామ్‌లుగా ఉంటుంది. ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు, ప్రత్యేక సందర్భాలు లేదా ప్రధాన ఈవెంట్‌లు మినహా రోజంతా టోల్ Dh4 ఉంటుంది. ఇక అర్ధరాత్రి ఒకటి నుండి తెల్లవారుజాము 6గంటల వరకు ఉచితం. పైన పేర్కొన్న రేట్లు సంవత్సరంలోని అన్ని రోజులకు వర్తిస్తాయని, రమదాన్ సమయంలో వేర్వేరు వేరియబుల్ ధరల సమయాలు ఉంటాయని ప్రకటించారు.
రమదాన్‌లో రేట్లు: వారపు రోజు పీక్ అవర్స్‌లో ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు Dh6; వారపు రోజులలో ఉదయం 7 నుండి 9 గంటల వరకు, మరుసటి రోజు సాయంత్రం 5 నుండి ఉదయం 2 గంటల వరకు రద్దీ లేని సమయాలలో Dh4. రమదాన్ సందర్భంగా సోమవారం నుండి శనివారం వరకు తెల్లవారుజామున 2 నుండి ఉదయం 7 గంటల వరకు టారీఫ్ ఉచితం. ఆదివారాల్లో (పబ్లిక్ సెలవులు, ప్రధాన ఈవెంట్లలో మినహా), సాలిక్ రుసుము రోజంతా ఉదయం 7 నుండి 2 గంటల వరకు Dh4 ఉంటుంది. అర్ధరాత్రి 2 నుండి నుండి ఉదయం 7వరకు ఉచితం.
అల్ సఫా నార్త్, అల్ సఫా సౌత్ టోల్ గేట్‌ల గుండా వెళుతున్నప్పుడు, అలాగే అల్ మమ్జార్ నార్త్, అల్ మమ్జార్ సౌత్ టోల్ గేట్‌లను ఒక గంటలోపు ఒకే దిశలో వెళ్లినప్పుడు ఛార్జీలలో ఎటువంటి మార్పు ఉండదని సాలిక్ పేర్కొంది. ప్రస్తుతం, దుబాయ్ నగరం అంతటా ఉన్న 10 టోల్ గేట్‌లలో వాహనం దాటిన ప్రతిసారీ సాలిక్ నిర్ణీత రుసుము 4 దిర్హామ్‌లు వసూలు చేస్తున్నారు.
పార్కింగ్ ఫీజులో మార్పులు
వేరియబుల్ పార్కింగ్ టారిఫ్ పాలసీని మార్చి 2025 చివరి నాటికి అమలు చేయడానికి షెడ్యూల్ చేశారు. ఈ పాలసీ ప్రీమియం పార్కింగ్ స్థలాలకు గంటకు Dh6, ఇతర పబ్లిక్ పెయిడ్ పార్కింగ్ స్థలాలకు ఉదయం రద్దీ సమయాల్లో (ఉదయం 8 నుండి 10 గంటల వరకు), సాయంత్రం పీక్ అవర్స్ (సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు).. రద్దీ లేని సమయాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు రేట్స్ మారవు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు, ఆదివారం రోజంతా పార్కింగ్ ఉచితం. ఈవెంట్ ప్రాంతాల కోసం రద్దీ ధరల విధానం ఈవెంట్ జోన్‌లకు సమీపంలో పబ్లిక్ పెయిడ్ పార్కింగ్ స్థలాలకు గంటకు Dh25 రుసుమును వసూలు చేస్తారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం.. ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమయ్యే ప్రధాన ఈవెంట్‌ల సమయంలో ఈ విధానం మొదట దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చుట్టూ అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







