కొచ్చి డైలాగ్ 2025: ఇండియా- GCC మధ్య బలమైన సంబంధాలు..!!

- January 18, 2025 , by Maagulf
కొచ్చి డైలాగ్ 2025: ఇండియా- GCC మధ్య బలమైన సంబంధాలు..!!

మనామా: కొచ్చి డైలాగ్ 2025 ఎడిషన్‌ సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) –ఇండియా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచనుంది. దీనిని భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహకారంతో సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ (CPPR) నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో GCC సెక్రటరీ జనరల్ H.E. జాసెమ్ మొహమ్మద్ అల్-బుదైవి ప్రత్యేకంగా ప్రసంగించారు. కేరళలో జరగనున్న ఇండియా-GCC సంబంధాలపై దృష్టి సారించే మొట్టమొదటి ట్రాక్ 1.5 డైలాగ్‌గా, కొచ్చి డైలాగ్ 2025 వ్యాపార నాయకులు, ఇతర వాటాదారులకు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు.  ‘ఇండియాస్ లుక్ వెస్ట్ పాలసీ ఇన్ యాక్షన్: పీపుల్, ప్రోస్పెరిటీ అండ్ ప్రోగ్రెస్’ అనే థీమ్‌పై ఆయన మాట్లాడారు. ఇండియా-జిసిసి సంబంధాలను బలోపేతం చేయడానికి కార్యాచరణ వ్యూహాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తుందన్నారు.  కొచ్చి డైలాగ్ 2025 ద్వారా ఇండియా- GCC మధ్య సంపన్నమైన మరియు శాశ్వతమైన భాగస్వామ్యానికి పునాదులను పటిష్టం చేయాలని ఈవెంట్ లో ప్రసంగించిన వక్తలు ఆకాంక్షించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com