దుబాయ్ ఉత్తమ ప్రభుత్వ సంస్థలను ప్రకటించిన షేక్ హమ్దాన్..!!

- January 19, 2025 , by Maagulf
దుబాయ్ ఉత్తమ ప్రభుత్వ సంస్థలను ప్రకటించిన షేక్ హమ్దాన్..!!

దుబాయ్: 2024 కోసం దుబాయ్‌లోని ఉత్తమ ప్రభుత్వ సంస్థల జాబితాను ప్రకటించారు.  మొహమ్మద్ బిన్ రషీద్ హౌసింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (MBRHE) కస్టమర్, ఉద్యోగుల హ్యాపీనెస్ సూచికలలో 96.7 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, దుబాయ్‌లోని అన్ని ప్రభుత్వ సంస్థల సగటు కస్టమర్ సంతోషం రేటింగ్ 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉందని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి, యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. 2024 కస్టమర్, ఎంప్లాయీ, మిస్టరీ షాపర్ హ్యాపీనెస్ స్టడీ ఫలితాలను ఆమోదించిన తర్వాత జాబితాను ప్రకటించారు.  

2024లో కస్టమర్ సంతోషం కోసం రెండవ అత్యుత్తమ సంస్థ దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) 97.01 శాతం రేటింగ్‌తో ఉండగా, ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ (IACAD) 96.99 శాతంతో మూడవ స్థానంలో ఉంది. 2024లో ఉద్యోగుల పరంగా అవ్కాఫ్ దుబాయ్ 96.2 శాతం రేటింగ్‌తో రెండవ స్థానంలో ఉంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA), 95.3 శాతం రేటింగ్‌తో మూడవ స్థానంలో ఉంది.

దుబాయ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ (DGEP) ద్వారా ఏటా విడుదల చేయబడిన నివేదికలో దుబాయ్ ప్రభుత్వ వినియోగదారులకు సగటు హ్యాపినెస్ సూచిక 93.8 శాతం అని వెల్లడించింది. 86.7 శాతం దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగుల సగటు హ్యాపినెస్ సూచిక, 95.8 శాతం సగటు డైలీ మిస్టరీ షాపర్ ఇండెక్స్ ఉన్నాయి. 2024 మిస్టరీ షాపర్ సర్వే, సగటు హ్యాపినెస్ స్కోర్ 95.8 శాతం నమోదు చేసింది. సర్వీస్ సెంటర్‌లు, కాల్ సెంటర్‌లు, వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్‌లతో సహా పలు టచ్‌పాయింట్‌లలో ప్రభుత్వ సేవల నాణ్యతను అంచనా వేయడంలో ప్రాథమిక పాత్ర పోషిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com