బహ్రెయిన్ లో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు చట్టబద్ధత..!!

- January 20, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు చట్టబద్ధత..!!

మనామా: ఆన్‌లైన్ వ్యాపారాలు తమ చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా ఉండేలా పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.  ISIC4 కోడ్ 6312 కింద ఇ-మార్కెట్‌ప్లేస్‌లు, వెబ్‌సైట్‌లు లేదా వెబ్ పోర్టల్‌లను నడుపుతున్న కమర్షియల్ రిజిస్ట్రేషన్ (CR) హోల్డర్‌లు ఇప్పుడు www.Sijilat.bh వద్ద సిజిలాట్ సిస్టమ్‌లో తమ ‘eStore/ eMarketplace చిరునామా’ని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.  వినియోగదారుల నమ్మకాన్ని బలోపేతం చేయడానికి, వ్యాపారాలకు విస్తృత మార్కెట్ అవకాశాలను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.

ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల చట్టబద్ధతను నిర్ధారించే లక్ష్యంతో ఉచిత ధృవీకరణ వ్యవస్థ ఇ-కామర్స్ సీల్ (ఇఫాడా)ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పరిశ్రమ, వాణిజ్య మంత్రి అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రో, బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్ బోర్స్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యవస్థను ప్రారంభించారు. వ్యాపారాలు, వారి వినియోగదారుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడే సాధనంగా దీనిని ఆయన అభివర్ణించారు.

ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డైరెక్టరేట్‌కు చీఫ్ మారమ్ అల్ మహ్మీద్ మాట్లాడుతూ.. ఈ-కామర్స్‌ను మరింత విశ్వసనీయంగా మార్చడానికి ఇఫాడాను రూపొందించినట్టు తెలిపారు.   అప్‌డేట్ చేసిన ఫ్రేమ్‌వర్క్ వర్చువల్ వ్యాపారాలకు మాత్రమే వర్తిస్తుందని, సోషల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడే కుటుంబ నిర్వహణ సంస్థలకు కాదని స్పష్టం చేశారు.

ఆహారం, పొగాకు, వైద్య ఉత్పత్తులు, భారీ యంత్రాలు వంటి 12 వర్గాల విక్రయాలను పరిమితం చేస్తూ.. వస్త్రాలు, దుస్తులు, పురాతన వస్తువులు, సాఫ్ట్‌వేర్, నిర్వహణ కన్సల్టింగ్‌తో సహా 71 ఉత్పత్తులు, సేవలను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి అప్డేట్ చేసిన నియమాలు వర్చువల్ వ్యాపారాలను అనుమతిస్తాయి. వర్చువల్ కమర్షియల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారులు తప్పనిసరిగా బహ్రెయిన్ పౌరులు అయి ఉండాలి.  మరింత సమాచారం కోసం [email protected] వద్ద ఇమెయిల్ ద్వారా లేదా 17574888కి కాల్ చేయడం ద్వారా పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com