‘అక్రాస్ ఏజెస్’లో స్టూడెంట్ స్టార్టప్‌ల వార్షిక ఫోరమ్ ప్రారంభం..!!

- January 22, 2025 , by Maagulf
‘అక్రాస్ ఏజెస్’లో స్టూడెంట్ స్టార్టప్‌ల వార్షిక ఫోరమ్ ప్రారంభం..!!

మస్కట్: 2024/2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి వార్షిక విద్యార్థి స్టార్టప్‌ల ఫోరమ్ అ'దఖిలియా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ మనాలోని "ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం"లో ప్రారంభమైంది. "సాధికారత, సుస్థిరత" అనే నినాదంతో నిర్వస్తున్న ఈ ఫోరమ్‌లో యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ (UTAS) వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 24 విద్యార్థి కంపెనీలు పాల్గొన్నాయి. రెండు రోజుల ఫోరమ్ యువత పాత్రను హైలైట్ చేయడం, వారి వినూత్న ప్రతిభను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫోరమ్ ప్రారంభోత్సవం హెచ్‌హెచ్ సయ్యద్ లోయ్ ఖలీద్ అల్ సైద్ ఆధ్వర్యంలో జరిగింది.  ఇందులో అ'దఖిలియా గవర్నర్ షేక్ హిలాల్ సైద్ అల్ హజ్రీ పాల్గొన్నారు.

మొదటి రోజు ప్రోగ్రామ్‌లో మూడు విజువల్ ప్రెజెంటేషన్‌లు ఇచ్చారు. వీటిలో మొదటిది విద్యార్థుల స్టార్టప్‌లకు అవసరమైన మద్దతును అందించడంలో UTAS పాత్రను తెలియజేశారు.  రెండవది "భవిష్యత్తును నిర్మించే అనుభవాలు" పేరుతో స్వీయ-వివరణాత్మక ప్రదర్శన కాగా, మూడవ ప్రదర్శన వివిధ రంగాలకు సంబంధించిన వినూత్న విద్యార్థి ప్రాజెక్ట్‌లను ప్రదర్శించింది.  అనంతరం HH సయ్యద్ లోయ్.. స్పాన్సర్ చేసిన కంపెనీలు, సంస్థల ప్రతినిధులు, అతిథులను సత్కరించారు. కృత్రిమ మేధస్సు (AI), పునరుత్పాదక శక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), వ్యవసాయం, పర్యావరణం, పరిశ్రమ, విద్య, ఆరోగ్యం, క్రీడలు, సమాజ సేవ, చమురు,  గ్యాస్ రంగాలను కవర్ చేసే విద్యార్థి స్టార్టప్‌ల ప్రదర్శనను ప్రారంభించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com