కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!

- January 22, 2025 , by Maagulf
కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!

కువైట్: కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేయడానికి ముందు అవగాహన ప్రచారాలను ముమ్మరం చేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, సుప్రీం ట్రాఫిక్ కౌన్సిల్ చైర్మన్, లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా తెలిపారు. సుప్రీం ట్రాఫిక్ కౌన్సిల్ 23వ సమావేశానికి షేక్ సలేం అల్-నవాఫ్ అధ్యక్షత వహించారు.  రోడ్లు, రవాణా కోసం పబ్లిక్ అథారిటీ.. కువైట్ మునిసిపాలిటీతో పాటు అంతర్గత, విద్య, పబ్లిక్ వర్క్స్, సమాచార మంత్రిత్వ శాఖలకు చెందిన కౌన్సిల్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షేక్ సలేం అల్-నవాఫ్ ట్రాఫిక్ భద్రత కోసం జాతీయ వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ సంస్థలు,  పౌర సమాజం మధ్య సహకారం ప్రాముఖ్యతను సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడం, ట్రాఫిక్ భద్రతలో పరిణామాలపై సమీక్షి, రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడం కోసం భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com