తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- January 22, 2025
తిరుపతి: తిరుపతి లో వైకుంఠ ఏకాదశి దర్శనాల టోకెన్ల పంపిణీ సందర్బంగా జరిగిన తొక్కిసలాట ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కు ఆదేశించింది.ఈ నెల 8 వ తేదీ రాత్రి తిరుపతి లోని పద్మావతి పార్కు వద్ద టోకెన్ల పంపిణీ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో 6 గురు మరణించాగా మరో 40 మంది దాకా గాయపడిన విషయం తెలిసిందే..
వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పలువురు అధికారులపై చర్యలు తీసుకుని భాదితుల ఉపశమన చర్యలు కూడా తీసుకున్న విషయం విదితమే.అప్పుడు స్వయంగా తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయ విచారణ చేయిస్తామని ప్రకటించారు.
ఆ మేరకు ప్రభుత్వం ఈరోజు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి to న్యాయ విచారణ కు ఆదేశాలు (జి ఓ నెం 16)జారీ చేసింది.మొత్తం ఘటన కు కారణాలు, ఎవరు బాధ్యులు అనే విషయాలను తేల్చడం తో పాటు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. మరో ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







