ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- January 23, 2025
దావోస్: ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రగతిశీల ఆలోచనలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రస్తుతం 11 గిగావాట్లుగా ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యాన్ని 2030నాటకి పెంచాలన్నది మా లక్ష్యం. ఇది మొత్తం దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో 32శాతంగా ఉంది. 2030నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024 రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారీని కూడా ప్రోత్సహిస్తుంది. రెన్యవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఎపిలో రెన్యువబుల్ ఎనర్జీ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుచేసి, ప్రోత్సాక ప్రయోజనాలను అందిపుచ్చుకోండి. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కు సంబంధించిన ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్ లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్ ను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించాలని మంత్రి లోకేష్ కోరారు. ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ మాట్లాడుతూ.... 2023-24లో 5 గిగావాట్ల ఆర్డర్లతో భారత్ లో ఎన్విజన్ అగ్రగామి విండ్ టర్భైన్ సరఫరాదారుగా నిలచింది. భారతదేశంలో 3 గిగావాట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో పూణే లోని నాసెల్లె లో, బ్లేడ్లల కోసం త్రిచిలో రూ.500 కోట్లతో అత్యాధునిక తయారీ ప్లాంట్లను ఏర్పాటుచేశాం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని భావిస్తున్నాం. ఆంధప్రదేశ్ విజ్ఞప్తిపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!