కువైట్‌లో డయాబెటిస్ సాధారణం: కువైట్ ఆరోగ్య మంత్రి
- January 25, 2025
కువైట్: డయాబెటిస్ అనేది కువైట్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీర్ఘకాలిక, సాధారణ వ్యాధి అని, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం అని కువైట్ ఆరోగ్య మంత్రి అహ్మద్ అల్-అవధి అన్నారు. దాస్మన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ (డిడిఐ) నిర్వహించిన మొదటి అంతర్జాతీయ డస్మాన్ డయాబెటిస్ సమ్మిట్ (ఐడిడిఎస్)లో మంత్రి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మధుమేహం అనేది గుండె వ్యాధులు, పక్షవాతం, దృష్టి లోపం, మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతుందని మంత్రి హెచ్చరించారు. 400 మందికి పైగా కువైట్, గల్ఫ్, ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, నిపుణులు ఇందులో పాల్గొంటున్నారు. డయాబెటిస్ సంబంధిత సమస్యలు, నివారణ, మెడిసిన్స్ లో పరిశోధనలు వంటి విషయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కీలక పరిశోధన పేపర్స్ పై సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







