చివరి దశకు చేరిన ఆర్జీవీ వంగవీటి షూటింగ్
- June 30, 2016
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో కాంట్రవర్షియల్ మూవీ వంగవీటి. విజయవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో.. ప్రత్యేకంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు వర్మ. టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.సినిమా ఎనౌన్స్ చేసిన సమయంలో వరుసగా పాత్రలను పరిచయం చేస్తూ తెగ హడావిడి చేసిన వర్మ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. మకాం ముంబైకి మార్చేయటం, బాలీవుడ్ లో వీరప్పన్ సినిమా ప్రమోషన్ లో బిజీ కావటంతో వంగవీటి సినిమా ఆగిపోయినట్టే అని భావించారు. అయితే ఇప్పుడు వంగవీటి సినిమా షూటింగ్ పూర్తికావచ్చిందన్న వార్త టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఎనౌన్స్ మెంట్ సమయంలోనే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా రిలీజ్ టైంకి ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







