ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్‌..!!

- January 29, 2025 , by Maagulf
ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్‌..!!

మస్కట్: భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 27న భారత రాయబార కార్యాలయం గ్రాండ్ రిసెప్షన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఒమన్ సుల్తానేట్ వాణిజ్యం, పరిశ్రమలు,  పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మహ్మద్ అల్ యూసఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రత్యేక అతిథిగా పాల్గొనడం పట్ల రాయబార కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. వారితోపాటు వివిధ దేశాల రాయబారులు, డిఫెన్స్ అటాచ్‌లు, దౌత్యవేత్తల, ఒమానీ - భారతీయ కమ్యూనిటీ సభ్యులతో సహా 1,000 మందికి పైగా హాజరయ్యారు. కైస్ బిన్ మహ్మద్ అల్ యూసఫ్‌తో 11వ ఇండియా-ఒమన్ జాయింట్ కమిషన్ మీటింగ్‌ కోసం పీయూష్ గోయల్ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో ఇండియా అసాధారణ పురోగతి సాధించిందని పీయూష్ గోయల్ తెలిపారు. కరోనా అనంతర ఇండియా-ఒమన్ సంబంధాలలో అద్భుతమైన పురోగతిని ఒమన్ లో భారత రాయబారి అమిత్ నారంగ్ హైలైట్ చేశారు.   'సుర్ సండూక్' పేరుతో ఒక ప్రత్యేకమైన సంగీత ప్రదర్శనను నిర్వహించారు. ఒమానీ వయోలిన్ వాద్యకారుడు నాసర్ అల్ కిండీ బృందం ప్రదర్శనతోపాటు కేరళకు చెందిన చెండా బ్యాండ్ బృందం ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. కోణార్క్ వీల్,  హవా మహల్ వంటి భారతదేశ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌ల ప్రతిరూపాలను ఏర్పాటు చేసిన సెల్ఫీ జోన్ ప్రత్యేకంగా నిలిచింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com