'కస్టమ్స్ వేలం' ప్లాట్‌ఫారమ్‌ను ప్రకటించిన కస్టమ్స్ అథారిటీ..!!
- January 29, 2025
దోహా: జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (GAC) 2025 అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని జరుపుకుంది. "కస్టమ్స్ డెలివరింగ్ ఆన్ కమిట్మెంట్ టు ఎఫిషియెన్సీ, సెక్యూరిటీ అండ్ ప్రోస్పెరిటీ" అనే నినాదంతో అనేక కార్యక్రమాలను నిర్వహించింది. వేడుకలో భాగంగా ఎలక్ట్రానిక్ కస్టమ్స్ వేలం ప్లాట్‌ఫారమ్ 'కస్టమ్స్ వేలం' ను ప్రకటించింది. ఇందులో కస్టమ్స్ క్లియరెన్స్ విధానాల ఫ్రేమ్‌వర్క్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, అన్ని అవుట్‌లెట్ గణాంకాలు , కస్టమ్స్ డేటాను అందుబాటులో పెట్టినట్టు జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఛైర్మన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ జమాల్ తెలిపారు. సరిహద్దు ఓడరేవులలో సరికొత్త తనిఖీ పరికరాలను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. నిషేధిత స్మగ్లింగ్ కార్యకలాపాలను ఎదుర్కోవడం, మాదక ద్రవ్యాలు, నిషేధిత పదార్థాలు, నకిలీ వస్తువుల స్మగ్లింగ్ కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అథారిటీ తన ప్రయత్నాలను బలోపేతం చేస్తున్నట్టు వివరించారు. గత ఏడాది వివిధ కస్టమ్స్ ఉల్లంఘనలకు సంబంధించి 4,626 కేసులు నమోదైనట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష