ఏపీ: ఉగాదికి మహిళలకు తీపి కబురు
- January 29, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాదికి మహిళలకు తీపి కబురు చెప్పొబోతోంది. ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. వచ్చే నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి విధి విధానాలు ప్రకటించే A.P.S.R. T. C. అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు చెపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరిట మహిళలకు పలు వరాలు ప్రకటించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పథకాల నిరంతరం అధికారులతో సమీక్షిస్తూ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు.ఇందులో భాగంగా పలు పథకాల అమలుపై కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ అమలులో లోటుపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరో పథకం అమలుపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలును ఉగాది నుంచే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష