దోహా జ్యువెలరీ, వాచెస్ ఎగ్జిబిషన్.. 500 బ్రాండ్‌లతో ప్రారంభం..!!

- January 31, 2025 , by Maagulf
దోహా జ్యువెలరీ, వాచెస్ ఎగ్జిబిషన్.. 500 బ్రాండ్‌లతో ప్రారంభం..!!

దోహా: దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో దోహా జ్యువెలరీ & వాచెస్ ఎగ్జిబిషన్ 2025 (DJWE)ని ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి హెచ్‌ఈ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు. అనంతరం అల్ ఖర్జి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ప్రముఖ MICE గమ్యస్థానంగా ఎదుగుతుందన్నారు. ప్రపంచ సందర్శకులను ఆకర్షించే ప్రపంచ స్థాయి ఈవెంట్‌లను నిర్వహించగల ఖతార్ సామర్థ్యానికి దోహా జ్యువెలరీ & వాచెస్ ఎగ్జిబిషన్ ఒక ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన కళాత్మకత, ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.  ఫిబ్రవరి 5 వరకు జరిగే ప్రదర్శనలో అల్ మజెద్ జ్యువెలరీ, అల్ ఫర్దాన్ జ్యువెలరీ, అలీ బిన్ అలీ లగ్జరీ, అమిరి జెమ్స్, ఫిఫ్టీ-వన్ ఈస్ట్, అల్ ముఫ్తా జ్యువెలరీ, బ్లూ సెలూన్, బ్వ్లగారి, ఆర్ట్స్ అండ్ జెమ్స్ వంటి 500 కంటే ఎక్కువ బ్రాండ్‌ల సేకరణలు, అత్యాధునిక డిజైన్‌లను ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో ఖతారీ, టర్కిష్, ఇండియన్ పెవిలియన్‌లు ప్రత్యేకంగా అందరిని ఆకట్టుకుంటున్నాయి. శనివారం నుండి బుధవారం వరకు మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు, గురువారం మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com