లేబర్ క్యాంపులో కత్తితో దాడి.. వ్యక్తికి 3 ఏళ్ల జైలుశిక్ష, బహిష్కరణ..!!
- January 31, 2025
యూఏఈ: దుబాయ్లోని లేబర్ క్యాంపులో జరిగిన వివాదంలో కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఒక వ్యక్తికి మూడు సంవత్సరాల జైలుశిక్ష, Dh50,000 జరిమానా విధించింది. ఈ సంఘటన డిసెంబర్ 30, 2023న దుబాయ్లోని అల్ క్వోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. కోర్టు రికార్డుల ప్రకారం.. ఇద్దరు భారతీయ పౌరులు షేరింగ్ రూమ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన సమయంలో వివాదం చెలరేగి కత్తితో దాడికి పాల్పడే వరకు వచ్చింది. కత్తితో దాడికి పాల్పడిన తర్వాత 23 ఏళ్ల నిందితుడు లేబర్ క్యాంపులో నానా హంగామా చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకొని తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితుడిని రషీద్ ఆసుపత్రికి తరలించారు. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
అలాగే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి గొడవకు పాల్పడినందుకుగానూ నిందితులపై ప్రత్యేక నేరారోపణలు చేస్తూ న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. అదనంగా ఆరు నెలల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా విధించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత నిందితుడిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష