యూఏఈలో కోకాకోలా తాగడానికి 'సురక్షితం'..!!
- January 31, 2025
యూఏఈ: యూఏఈలోని కోకాకోలా తాగడానికి సురక్షితమని , అందులో అధిక స్థాయిలో క్లోరేట్ లేదని వాతావరణ మార్పు, పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCaE) ధృవీకరించింది. స్థానిక మార్కెట్లలోని కోకాకోలా ఉత్పత్తులు సురక్షితమైనవని, దేశంలోని ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపింది. యూఏఈ మార్కెట్లలో లభించే ఉత్పత్తులు యూరోపియన్ రీకాల్‌కు లోబడి ఉండవని, ఎందుకంటే అవి స్థానికంగా అబుదాబిలో ఉన్న కోకాకోలా బాట్లింగ్ ప్లాంట్లలో ఉత్పత్తి అవుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కోకా-కోలా యూరోపియన్ బాట్లింగ్ యూనిట్..కోక్, స్ప్రైట్, ఫాంటా, ఇతర పానీయాల తనిఖీల్లో అధిక స్థాయిలో క్లోరేట్ ఉన్నట్లు గుర్తించిన తర్వాత వాటిని రీకాల్ చేయాలని ఆదేశించింది. నవంబర్ నుండి బెల్జియం, నెదర్లాండ్స్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్‌లలో రీకాల్ చేశారు. క్లోరేట్ అనేది ఆహార ప్రాసెసింగ్‌లో విస్తృతంగా ఉపయోగించే క్లోరిన్ క్రిమిసంహారిణుల నుండి తయారు అవుతుంది. 2015లో యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ క్లోరేట్‌ను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల పిల్లలలో అయోడిన్ లోపం ఏర్పడి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







