పదవీ విరమణ పొందిన రాచకొండ పోలీసు అధికారులను సత్కరించిన కమిషనర్
- January 31, 2025
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఎస్ఓటీ డీసీపీగా విధులు నిర్వహిస్తూ ఈ రోజు పదవీ విరమణ పొందిన కె.మురళీధర్ కి సుధీర్ బాబు తన కార్యాలయంలో ప్రత్యేక సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సబ్ ఇన్‌స్పెక్టర్ గా సర్వీస్ ప్రారంభించి పోలీసు శాఖలోని అన్ని విభాగాలలో వివిధ స్థాయిల్లో సమర్థవంతంగా పనిచేసి తన ప్రతిభాపాటవాలు మరియు చక్కటి పనితీరుతో అంచెలంచెలుగా ఎదిగి డీసీపీ స్థాయికి చేరుకోవడం అభినందనీయం అని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసే సమయంలో క్షేత్రస్థాయిలో ఎన్నో సంఘర్షణలను, ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వర్తించిన మురళీధర్ నిబద్ధతను సీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు.ఎన్నో ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పోలీసుశాఖలో వివిధ స్థాయిల్లో సమర్థవంతంగా పలు విభాగాలకు నాయకత్వం వహించి, వారి అమూల్యమైన సేవలు అందించినందుకు సీపీ గారు అభినందించారు.అధికారులు అందరూ మురళీధర్ గారి అనుభవాన్ని, నైపుణ్యాన్ని స్పూర్తిగా తీసుకుని పని చేయాలని సూచించారు.
డీసీపీ మురళీధర్ తో పాటు ఇదే రోజు పదవీ విరమణ పొందుతున్న ఎల్.బి నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ, భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ డి.కుమారస్వామి లను సీపీ గారు అభినందించారు. తాను భువనగిరిలో పనిచేసే సమయంలో నక్సలైట్లతో అకస్మాత్తుగా జరిగిన ప్రాణాంతక ఎదురుకాల్పుల్లో ధైర్యంగా తనతో పాటు పోరాడిన డి.కుమారస్వామి తెగింపును సీపీ గారు ప్రత్యేకంగా గుర్తుచేసి ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం అందరూ విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా డీసీపీ గారితో వివిధ స్థాయిల్లో, పలు విభాగాల్లో కలిసి పని చేసిన పలువురు అధికారులు వారి అనుభవాన్ని పంచుకున్నారు. వృత్తి పట్ల మురళీధర్ గారి అంకితభావాన్ని, తోటి అధికారులు, సిబ్బందితో వారి స్నేహపూర్వక ప్రవర్తనా శైలిని, సహకార గుణాన్ని, నాయకత్వ లక్షణాలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డిసిపి మల్కాజ్గిరి పద్మజ, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డిసిపి ఎస్ఓటి 1 రమణారెడ్డి, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, డిసిపి ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, పలువురు అదనపు డీసీపీలు, ఏసిపిలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సీహెచ్ భద్రారెడ్డి, కృష్ణారెడ్డి, ఇతర అధికారులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







