రియాద్ సీజన్ 2024.. రికార్డు స్థాయిలో 18 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- February 01, 2025
రియాద్: రియాద్ సీజన్ 2024కి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్లకు పైగా సందర్శకులు స్వాగతం పలికినట్లు జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. ఈ సీజన్ ఇంకా కొనసాగుతోందని, ప్రేక్షకులను ఆకట్టుకునేలా మరిన్ని ప్రపంచ స్థాయి ఈవెంట్లు, ప్రదర్శనలు జరుగుతాయని అల్-షేక్ తెలిపారు.
రియాద్ సీజన్ ఈ సంవత్సరం ఎడిషన్ వినోదం, టెక్నాలజీలో ప్రధాన గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అలాగే ఆర్ట్స్, క్రీడల ప్రపంచాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తుందన్నారు. రియాద్ సీజన్ పర్యాటకం, వినోద రంగాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ సీజన్ థియేట్రికల్, సంగీత ప్రదర్శనలు, ఎస్పోర్ట్స్ టోర్నమెంట్లు, అంతర్జాతీయ ఫుడ్ అనుభవాలు , థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఆకర్షణలతో సహా ప్రత్యేకమైన అనుభవాలను అందిస్తుందని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష