ఐటి సెల్, ఎస్ఓటీ ఎల్ బి నగర్ మరియు ఉప్పల్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలను సందర్శించిన సీపీ

- February 01, 2025 , by Maagulf
ఐటి సెల్, ఎస్ఓటీ ఎల్ బి నగర్ మరియు ఉప్పల్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలను సందర్శించిన సీపీ

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీసు విభాగాల అధికారులు మరియు సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ సుధీర్ బాబు ఈ రోజు ఎల్.బి నగర్ లోని రాచకొండ ఐటి సెల్, ఎస్ఓటీ కార్యాలయాలను మరియు ఉప్పల్ పోలీస్ స్టేషన్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఐటి సెల్ కార్యాలయ సిబ్బందితో మాట్లాడి, రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పలు కేసుల దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను అందించడంతో పాటు, పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్, 100 డయల్ వంటి అత్యవసర సేవల అమలులో ఐటి సెల్ పోషిస్తున్న పాత్రను అభినందించారు. ఐటి సెల్ కార్యాలయంలోని సోషల్ మీడియా మరియు ఇతర విభాగాల స్టాఫ్ పనితీరు సమీక్షించారు.సీసీటీవీల అవసరాన్ని ప్రజల్లో మరింతగా ప్రచారం చేయాలని, వాటి నిర్వహణను మరింత పటిష్టం చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల వద్దకు పోలీసులు మరింత త్వరగా చేసుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, నూతన విధానాలను రూపొందించాలని సూచించారు.

ఎస్ఓటీ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. రాచకొండ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను, మరియు అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠాలను ఉక్కుపాదంతో అణచివేయాలని సూచించారు.ఇతర దేశాల నుండి వచ్చిన శరణార్థులు మరియు ఇతర రాష్ట్రాల నుంచి పని కోసం భారీగా హైదరాబాద్ నగరానికి వస్తున్న వివిధ కార్మికులు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 

ఈ రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ అదనపు డీసీపీ షాకీర్ హుస్సేన్,ఎసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్, ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com