ఇ-బర్త్‌ సర్టిఫికెట్లపై నిర్ణయం జులైలో

- June 30, 2016 , by Maagulf
ఇ-బర్త్‌ సర్టిఫికెట్లపై నిర్ణయం జులైలో


ఇ-బర్త్‌ సర్టిఫికెట్ల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై నిర్ణయం జులైలో జరగవచ్చునని అధికారికవ ర్గాలు చెబుతున్నాయి. ఇగవర్నమెంట్‌ అథారిటీ, హెల్త్‌ మినిస్ట్రీ సంయుక్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నాయి. ఎలక్ట్రానిక్‌ మెథడ్‌లో ఇ-బర్త్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి ఇప్పటికే ఆమోదం లభించింది. కొత్త జననాల్ని నమోదు చేయడానికి ఈ కొత్త విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అటు ప్రభుత్వానికి ఇటు నివాసితులకు ఈ విధానం కారణంగా సమయం కలిసొస్తుందని అధికారులు చెప్పారు. ఇదివరకటి రోజుల్లో అయితే ఓ బిడ్డ పుట్టిన 48 గంటల తర్వాత నాలుగు నెలలకుగాను బర్త్‌ సర్టిఫికెట్‌ లభించేది కాదు. అయితే ఇక నుంచి ఆ సమయం గణనీయంగా తగ్గనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com