బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

- July 01, 2016 , by Maagulf
బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి రాజధాని పాలనా కేంద్రంగా విజయవాడలో మరో ప్రభుత్వ కార్యాలయం ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ఆశాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఉదయం ప్రారంభించారు. విజయవాడలోని కానూరు వద్ద సంచాలకుల కార్యాలయంతో పాటు బీసీ కార్పొరేషన్‌ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లావాదేవీలు జరిపిన కొన్ని దస్త్రాల కారణంగానే బీసీ సంక్షేమశాఖ డైరెక్టరేట్‌ కార్యాలయం రాక కాస్త ఆలస్యమైందని మంత్రి తెలిపారు. అంతకు ముందు స్థానిక ప్రజాప్రతినిధులతో కసిలి సంక్షేమశాఖ డైరెక్టరేట్‌ కార్యాలయాన్ని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com