యూఏఈలో రమదాన్: ప్రారంభ తేదీ, ఉపవాస సమయాలు, సెలవులు..!!

- February 03, 2025 , by Maagulf
యూఏఈలో రమదాన్: ప్రారంభ తేదీ, ఉపవాస సమయాలు, సెలవులు..!!

యూఏఈ: రమదాన్ 2025 సమీపిస్తున్నది. యూఏఈ అంతటా ముస్లింలు భక్తి, శ్రద్ధలతో సన్నద్ధమవుతున్నారు. పవిత్ర మాసంలో రోజువారీ దినచర్యలు మారతాయి. స్కూల్ పనివేళలు సర్దుబాటు అవుతాయి.  రమదాన్ సందర్భంగా యూఏఈలోని ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు పాస్టింగ్ ఉంటారు. తరావీహ్ అని పిలువబడే ప్రత్యేక రాత్రి ప్రార్థనలు మసీదులలో నిర్వహిస్తారు. నెలలో చివరి పది రోజులలో ప్రత్యేక ఖియామ్ ఉల్ లేల్ ప్రార్థనలు రాత్రి వరకు కొనసాగుతాయి.

రమదాన్ 2025 ప్రారంభం

రమదాన్ కు ముందు వచ్చే హిజ్రీ మాసమైన షాబాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక జనవరి 31న కనిపించింది. జనరల్ అథారిటీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ (Awqf) ప్రచురించిన హిజ్రీ క్యాలెండర్ ప్రకారం..  మార్చి 1న ఉపవాసాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

ఉపవాస వేళలు

రమదాన్ మొదటి రోజున, ఉపవాస సమయాలు 12 గంటల 58 నిమిషాలుగా అంచనా వేయబడింది. రమదాన్ 11వ రోజు నాటికి, తెల్లవారుజామున ఫజ్ర్ నమాజులు ఉదయం 5.16 గంటలకు, మగ్రిబ్ నమాజు సాయంత్రం 6.29 గంటలకు ఉన్నప్పుడు, ఉపవాస సమయాలు 13 గంటల 13 నిమిషాలకు పెరుగుతాయి. నెల చివరి రోజున, రమదాన్ పాటించే వారు 13 గంటల 41 నిమిషాల పాటు ఉపవాసం ఉంటారు. 

సలిక్ రేట్లు

రమదాన్ సందర్భంగా వివిధ సమయాల్లో టోల్ గేట్ల డైనమిక్ ధరలు పనిచేస్తాయి. టోల్ గేట్ కింద కారు వెళ్ళే ప్రతిసారీ పీక్-అవర్ ధరలు Dh6 వారం రోజులలో ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు వర్తించబడతాయి. వారాంతపు రద్దీ లేని సమయాల్లో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, మరుసటి రోజు సాయంత్రం 5 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ధర Dh4 ఉంటుంది. రమదాన్ సందర్భంగా సోమవారం నుండి శనివారం వరకు తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఉచితం. ఆదివారాల్లో (ప్రభుత్వ సెలవులు , ప్రధాన కార్యక్రమాల సమయంలో మినహా), సాలిక్ ఫీజులు రోజంతా ఉదయం 7 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు Dh4 ఉంటుంది. మిగతా సమయాల్లో ఉచితం.   

ఈద్ సెలవులు

రమదాన్ ప్రారంభం ఆధారపడి ఈద్ అల్ ఫితర్ మార్చి 30, మార్చి 31 లేదా ఏప్రిల్ 1న ఉంటుంది. ఈద్ ఏప్రిల్ 1న అయితే,  యూఏఈ నివాసితులకు ఆరు రోజుల వరకు సెలవులను అందిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com