ఘనంగా బిఎడ్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌ స్నాత‌కోత్స‌వం

- February 05, 2025 , by Maagulf
ఘనంగా బిఎడ్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌ స్నాత‌కోత్స‌వం

హైదరాబాద్: జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని బాలాజీన‌గ‌ర్‌లోని స్వ‌యంకృషి బిఎడ్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌ క‌ళాశాల‌లో బుదవారం విద్యార్థుల స్నాత‌కోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. స్పెషల్ బిఎడ్  కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్దులు ప‌ట్టాలు అందుకున్నారు.ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీ కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ప్రొఫెస‌ర్ కె.శ‌శికాంత్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ప‌ట్టాలు అందించారు.ఈ సంద‌ర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ...స్పెషల్ బిఎడ్ ప‌ట్టా అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఓయూ అడిష‌నల్ కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ప్రొఫెస‌ర్‌. డి.రాధికా య‌ద‌వ్, ప్రొఫెస‌ర్ సుజాత, ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ జే ల‌లిత,  ఓయూ అధ్యాప‌కులు డాక్ట‌ర్ బి సుజాత‌, స్వ‌యంకృషి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మంజుల క‌ళ్యాణ్‌, ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పీవీబీ సుధాక‌ర్‌, డాక్టర్ సుశీల్ కుమార్, అధ్యాప‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com