ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: రాజ్‌నాథ్ సింగ్‌కు లోకేశ్ విజ్ఞప్తి

- February 05, 2025 , by Maagulf
ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: రాజ్‌నాథ్ సింగ్‌కు లోకేశ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా లోకేశ్ ఈనెల 4న ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన మంత్రి నారా లోకేశ్ ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు.

డేటా సిటీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారుచేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామని లోకేశ్ చెప్పారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును కేంద్ర రైల్వేశాఖమంత్రి రాజ్ నాథ్‌ సింగ్‌కు తెలిపారు.

గత పాలకుల అనాలోచిత విధానాలతో రూ.10లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని అంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తోందని లోకేశ్ తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు హరీశ్ మాథుర్ ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com