అమెరికా: భారీగా పెరిగిన హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ పీజు!
- February 07, 2025
అమెరికా: అమెరికా ట్రంప్ సర్కార్ హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు భారీ షాకిచ్చింది. ఈ ఏడాది హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము భారీగా పెంచేసింది. ట్రంప్ ప్రభుత్వం వీసా రుసుమును ఏకంగా 215 డాలర్లుగా పెంచింది.
గతేడాది 10 మాత్రమే ఉన్న దరఖాస్తు రుసుము ఈ ఏడాది 215 డాలర్లకు పెరిగింది. కాగా, యూఎస్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)… వీసా రిజిస్ట్రేషన్ మార్చి 7 నుండి ప్రారంభించనుంది. ఈ రిజిస్ట్రేషన్ల దరఖాస్తు ప్రక్రియకు మార్చి 24 చివరి తేదీ.
లాటరీ ద్వారా ఎంపిక
H1B వీసా ప్రోగ్రామ్ సమగ్రతను పెంచడానికి గత అమెరికా ప్రభుత్వం పలు సవరణలను తీసుకువచ్చింది. దీంతో వీసా రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా పెరిగాయి. USCIS వార్షిక పరిమితి (65,000 వీసాలు)కి లోబడి ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తుంది. అయితే ఈ ఏడాది కూడా వార్షిక పరిమితికి మించి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో.. లాటరీ పద్ధతిలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
అయితే, ఒకే వ్యక్తికి బహుల ఎంట్రీలను నివారించడానికి.. బిడెన్ పరిపాలన H-1B వీసా రిజిస్ట్రేషన్ కోసం బెనిఫిషియల్ సెంట్రిక్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. ఈ బినిఫిషియల్ సెంట్రిక్ సిస్టమ్ విధానంతో ఒక దరఖాస్తుదారుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా.. ఒక్కసారి మాత్రిమే అతడి పేరు లాటరీలో నమోదు చేస్తారు. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







