31 మంది మావోయిస్టులు మృతి
- February 09, 2025
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ తెలిపారు.
మావోయిస్టుల ఇంకా గాలింపు కొనసాగుతోంది.డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా టీమ్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్కౌంటర్. గతంలో ఎన్కౌంటర్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు.
పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టుల గురించి భద్రతా దళాలకు సమాచారం అందడంతో ఇవాళ ఉదయం ఇంద్రావతీ నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు తిప్పికొట్టాయి.ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందినట్లు సమాచారం.అంతేగాక మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
కాగా, వచ్చే ఏడాది నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని గత నెలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్లలో వరుసగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







