కొత్త 'రైల్ బస్సు'ని ఆవిష్కరించిన ఆర్టీఏ..ఒక్కో ట్రిప్పుకు 40 మంది ప్రయాణికులు..!!

- February 11, 2025 , by Maagulf
కొత్త \'రైల్ బస్సు\'ని ఆవిష్కరించిన ఆర్టీఏ..ఒక్కో ట్రిప్పుకు 40 మంది ప్రయాణికులు..!!

దుబాయ్: కొత్త 'రైల్ బస్సు'ని దుబాయ్ ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఆవిష్కరించింది. రైల్ బస్ పూర్తిగా 3D-ప్రింటెడ్ వాహనం. రీ యూజబుల్ పదార్థాలతో తయారు చేయబడిందని  ఆర్టీఏ ప్రకటించింది. ఇంకా అభివృద్ధిలో దశలో ఉన్న ఇది స్వయంప్రతిపత్తి కలిగి సౌరశక్తితో నడిచే రవాణా వ్యవస్థ ఎమిరేట్‌లో విప్లవాత్మక ఆవిష్కరణ అవుతుందని భావిస్తున్నారు.

రైలు బస్సు మోడల్ ప్రస్తుతం మదీనాట్ జుమేరాలో ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2025లో ప్రదర్శించారు.  బస్సులో రెండు వరుసల సీట్లు, దివ్యాంగుల కోసం స్థలం కేటాయించారు. ఒక్కో క్యారేజ్‌లో 22 సీట్లు ఉంటాయి. 40 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.  సీట్ల పైన ఉంచిన స్క్రీన్‌లు తదుపరి స్టాప్‌లు, వాతావరణం, సమయంతో సహా ప్రయాణం గురించి రియల్ టైమ్ లైవ్ అప్‌డేట్‌లను అందిస్తాయి. ప్రయాణీకుల భద్రతా సూచనలు బస్సుకు ఇరువైపులా.. క్యారేజ్ రెండు చివర్లలో నియంత్రణ ప్యానెల్లు ఉన్నాయి. ఎలివేటెడ్ ట్రాక్‌లపై ప్రయాణిస్తుంది. ఎమిరేట్ చుట్టూ 100kmph వరకు వెళ్లేలా రూపొందించబడిన ఈ బస్సు 2.9 మీటర్ల ఎత్తు, 11.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అమలు ద్వారా ప్రపంచంలోనే అత్యంత స్మార్ట్ నగరంగా ఎదగాలనే దుబాయ్ ఆశయం నెరవేరుతుందని భావిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com