సౌదీ అరేబియాలో 360 మంది మహిళా రిక్రూట్‌ల పాసింగ్ పరేడ్..!!
- February 11, 2025
రియాద్: రియాద్‌లోని ఉమెన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన 360 మంది మహిళా రిక్రూట్‌మెంట్స్ పాసింగ్ పరేడ్ నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ వేడుకకు పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అల్-బస్సామి హాజరయ్యారు. అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో స్నాతకోత్సవం జరిగింది. గ్రాడ్యుయేట్లు బేసిక్ ఇండివిజువల్ క్వాలిఫికేషన్ కోర్సును పూర్తి చేసారు. ఇందులో ట్రైనింగ్, అప్లికేషన్లు, నాలెడ్జ్ సంబంధించినవి ఉన్నాయి. అన్ని అత్యవసర సమయాల్లో బాధ్యతలు చేపట్టేలా ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వారిని సిద్ధం చేశారు. భద్రతా పరమైన వ్యవస్థలు , నైపుణ్యాలలో మెరుగైన ట్రైనింగ్ ను వారికి అందజేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







