గ్లోబల్ హబ్‌గా ఖతార్..మరో అంతర్జాతీయ సమావేశానికి హోస్ట్..!!
- February 11, 2025
దోహా: ఖతార్ టూరిజం.. 51వ UN టూరిజం రీజినల్ కమిషన్ ఫర్ మిడిల్ ఈస్ట్‌కు ఫిబ్రవరి 12న దోహాలో హోస్ట్ చేయనుంది. ఈ సమావేశంలో ఈ ప్రాంతంలోని వివిధ దేశాలకు చెందిన పర్యాటక మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్ టూరిజం) అధికారులు పాల్గొంటారు. దోహాను హోస్ట్ సిటీగా ఎంపిక చేయడం, పర్యాటక రంగంలో ప్రాంతీయ, గ్లోబల్ హబ్‌గా ఖతార్ అభివృద్ధి చెందుతున్న స్థితిని తెలియజేస్తుందని అధికారులు తెలిపారు. ప్రధాన గ్లోబల్ ఈవెంట్లకు ఖతార్ కేరాఫ్ గా మారుతుందన్నారు. ముఖ్యంగా FIFA వరల్డ్ కప్ 2022ని హోస్ట్ చేయడంతో ఖతార్ కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిందని ఖతార్ టూరిజం చైర్మన్, విజిట్ కతార్ డైరెక్టర్ల బోర్డు చైర్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు. ఈ సమావేశంలో UN టూరిజం 2024-2025 కాలానికి సంబంధించి పనితీరుపై నివేదికలను అందజేస్తుంది. భవిష్యత్తు విధానాలు, ప్రణాళికలపై చర్చిస్తారు.
"స్పోర్ట్స్ టూరిజం, టూరిజం ఇండస్ట్రీ పోస్ట్-వరల్డ్ కప్" పేరుతో ఫిబ్రవరి 13న షెరటన్ గ్రాండ్ దోహా రిసార్ట్ & కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. ఈ ఈవెంట్ ద్వారా స్పోర్ట్స్ టూరిజం అనుభవాన్ని పెంపొందుతుందని పేర్కొన్నారు. ఖతార్ టూరిజం ఖతార్ జాతీయ విజన్ 2030కి అనుగుణంగా వైవిధ్యభరితమైన టూరిజం ఆఫర్లు, సందర్శకుల అనుభవాలను పెంపొందించడం, ఖతార్‌ను ఒక ప్రముఖ గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా స్థాపించడానికి తన ప్రతిష్టాత్మక వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









