అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్‌పోర్ట్ జారీ..!!

- February 12, 2025 , by Maagulf
అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్‌పోర్ట్ జారీ..!!

రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజాత్) కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. సౌదీ పౌరుడు, దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులలో ఒకరికి సౌదీ పాస్‌పోర్ట్‌ను అంతర్గత మంత్రిత్వ శాఖ అబ్షర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా జారీ చేయడానికి కొత్త సర్వీస్ ద్వారా అనుమతించనున్నారు.  అబ్షర్‌లో లాగిన్ అయి దరఖాస్తును సమర్పించడం ద్వారా కొత్త సేవలన పొందవచ్చని వెల్లడించారు. ఈ సేవ పౌరులు సులభంగా ఎలక్ట్రానిక్‌గా పాస్‌పోర్ట్‌లను పొందడానికి వీలు కల్పిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడానికి అవసరమైన షరతులు ఒక కుటుంబం సౌదీ జాతీయతను కలిగి ఉండాలని, భార్య వయస్సు 50 ఏళ్లకు మించకూడదని నిర్దేశిస్తుంది. అవసరమైన పరిస్థితులలో మాత్రమే ఒక మహిళ బిడ్డను దత్తత తీసుకోవడానికి అనుమతిస్తారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com