మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- February 12, 2025
అహ్మదాబాద్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన ఇంగ్లండ్ ముందు 357 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ బ్యాటింగ్ లో శుభమ్ గిల్ (112) శతకంతో మెరవగా, కోహ్లీ (52), శ్రేయస్ (78) లు అర్ధశతకాలు చేశారు. కెఎల్ రాహుల్ (40) ఆకట్టుకున్నాడు. ఇక హర్ధిక్ (17), అక్షర పటేల్ (13), వాషింగ్టన్ సుందర్ (14), హర్షిత్ రానా (13), అర్షదీప్ సింగ్ (2) పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషిద్ కు నాలుగు వికెట్లు లభించగా, వుడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.. మహమూద్, అట్కిన్ సన్, జోరూట్ లకు తలోవికెట్ దక్కింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. టాపార్డర్ బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (23), బెన్ డకెట్ (34), టామ్ బాంటన్ (38), జో రూట్ (24), హ్యారీ బ్రూక్ (19), గుస్ అట్కిన్సన్ (38) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక టీమిండియా బౌలర్లలో అర్శదీప్ సింగ్ (2/33), హర్షిత్ రాణా (2/31), అక్షర్ పటేల్ (2/22) రెండేసి వికెట్లు తీయగా… వాషింగ్ టన్ సుందర్ (1/43), కుల్దీప్ యాదవ్ (1/38) వికెట్లు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







