డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!
- February 17, 2025
దుబాయ్: డ్రగ్స్ కలిగి ఉన్నందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ సిరియా మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్, 100,000 దిర్హామ్ జరిమానా విధించారు.
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్‌కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దుబాయ్‌లో అల్ కియాదా మెట్రో స్టేషన్ సమీపంలో 37 ఏళ్ల నిందితురాలిని పోలీసులు గత ఏడాది ఏప్రిల్ 15న అరెస్టు చేశారు. మహిళ క్రిస్టల్ మెత్‌ను కలిగి ఉందని , ఉపయోగిస్తున్నట్లు తేల్చారు. మహిళ వద్ద నుండి ప్లాస్టిక్ బాటిల్‌లో 25.29 గ్రాముల లిక్విడ్ మెథాంఫేటమిన్, ఐదు ప్లాస్టిక్ ర్యాప్‌లలో 1.26 గ్రాముల క్రిస్టల్ మెత్ ను గుర్తించారు. ఆమె జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను బహిష్కరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే ప్రతి 100 దిర్హామ్‌లకు అదనంగా ఒక రోజు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







