హృదయ మది
- February 17, 2025
ఇసుమంత స్వార్ధంలేని స్వఛ్ఛమైనది ఇచ్చి పుచ్చుకోవడంలో అందంగా దాగినది
ఇరు మనసుల ఉఛ్వాస నిశ్వాస స్పందనది
ఇంకిపోదు ఎంతదూరమైన పరిగెత్తమనేది
ఇది అని తెలుపలేక అనుక్షణం తల్లడిల్లుతుంది
ఇధ్ధరిలో రహస్యాలకి తావేలేదనేది....
ఎటుచూసినా నీవే నేను నేనే నీవంటుంది
ఎటుచూస్తే అటు నీరూపమే నంటుంది
ఏవేవో తీయనైన ఊహాలతో తడిమేది
ఎంతో ఆనందంతో మనసుని మైమరిపించేది
ఏవేవో కలలని కనుపాపలో నిలిపే ఆరాధనది
ఎదను పదే పదే మీటే అనురాగ సరాగమది....
నిన్ను నన్ను కలిపిన మది ఆరాటమది
నిన్ను వదలి వెళ్ళలేననే నీదేననే మనసది
నిన్ను పరిచయం చేసిన సరికొత్త పరిచయమది
నిన్ను తలచుకునేలా చేసేటి తలపుల పరవశమది
నిన్ను కలిసే ప్రతిక్షణం వేచిచూస్తాననే నీ ప్రాణమది..
మనసు పొరల్లో అనునిత్యం స్పృజించేది
మనసున నీ కోసమే పరితపించే సంఘర్షణది
మనసు చాటున దాగి ఉండే జన్మబంధమది
మనసులు కలిసాక నీకై అర్పించిన హృదయమిది..
--యామిని కోళ్ళూరు(అబుధాబి)
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్‌కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్‌బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







