శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్‌ఫోర్స్‌.. ఎంపీలు ఆమోదం..!!

- February 19, 2025 , by Maagulf
శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్‌ఫోర్స్‌.. ఎంపీలు ఆమోదం..!!

మనామా: శిథిల గృహాలను ట్రాక్ చేయడానికి, విపత్తు సంభవించే ముందు యజమానులను ట్రాక్ చేయడానికి, శిథిలావస్థకు చేరిన భవనాల సమస్యలను పరిష్కరించడానికి అత్యవసర టాస్క్ పోర్స్  ఏర్పాటుకు పార్లమెంటు క్లియరెన్స్ ఇచ్చింది. శిథిల భవనాలు పెరుగడంపై ఆందోళనల నేపథ్యంలో ఈ మేరకు ప్రాతిపాదన వచ్చింది.  శిథిల భవనాలు నివాసితులకు, రహదారి వినియోగదారులకు ప్రమాదాన్ని కలిగిస్తాయని ఎంపీలు వాదించారు. గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు పౌర సమాజ ప్రతినిధులు, సంబంధిత ఇంజనీర్లను కలిసి, మల్టీ-ఏజెన్సీ టాస్క్‌ఫోర్స్‌ పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.

ఎంపీలు ఖలీద్ బునాక్, జైనాబ్ అబ్దుల్ అమీర్, హిషామ్ అల్ అవధి, మహ్మద్ అల్ మరాఫీ, వలీద్ అల్ దోసేరీల మద్దతుతో.. టాస్క్‌ఫోర్స్ టీమ్ ప్రమాదంలో ఉన్న భవనాలను అంచనా వేయడానికి, ప్రజల భద్రతకు ముప్పున్న అంశాలను అంచనా వేయడానికి ప్రమాణాలను నిర్దేశించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com