Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!

- February 19, 2025 , by Maagulf
Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!

యూఏఈ: స్కామర్‌లు తమ లోగో, ఉత్పత్తి ఫోటోలను ఉపయోగించి వినియోగదారులను వందల వేల దిర్హామ్‌లు మోసగించడంతో యూఏఈకి చెందిన ఓ కంపెనీ తీవ్రమైన ఆర్థిక నష్టాలను చవిచూసింది. అలాగే దాని బ్రాండ్ వాల్యూ గణనీయంగా తగ్గింది.  "స్కామ్‌లు ప్రారంభమైనప్పటి నుండి మా అమ్మకాలు క్షీణించాయి. గత కొన్ని నెలల్లో మా ఆర్డర్‌లు 90 శాతం వరకు క్రాష్ అయ్యాయి. నష్టాలను అరికట్టడానికి కొన్ని నెలలపాటు కార్యకలాపాలను మూసివేయాలని నేను ఆలోచిస్తున్నాను." అని సింప్లీ ది గ్రేట్ ఫుడ్ CEO షెహ్రోజ్ రామాయ్ తెలిపారు.

ఎనిమిది నెలల క్రితం, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ఈ స్కామ్‌ను తాము మొదట గమనించామని షెహ్రోజ్ చెప్పారు. అతని కథనం ప్రకారం.. స్కామర్‌లు A2 దేశీ నెయ్యి ఉత్పత్తి బ్రాండ్ లోగో, ఫోటోలను కాపీ చేసి కేవలం Dh1కి ఆఫర్‌ను ప్రచారం చేశారు. ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రాయోజిత ప్రకటనలు పోస్ట్ చేశారు. సింప్లీ ది గ్రేట్ ఫుడ్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేశారు. మోసగాళ్లు పెయిడ్ ప్రమోషన్లు నిర్వహించారు. దాంతో Dh1కి కొనుగోలుకు జనాలు ఆర్డర్లు చేసుకుని, పేమెంట్ చేసేందుకు ప్రయత్నించి తమ ఖాతాల్లోంచి అధిక మొత్తాలు కట్ కావడంతో నష్టపోయామని పోలీసులను ఆశ్రయించారు. 

దుబాయ్‌ కు చెందిన ఓ బాధితురాలు స్కామ్‌లో 100,000 దిర్హామ్‌లను కోల్పోయింది. తన డ్రీమ్ హోమ్ కోసం పక్కనపెట్టిన డబ్బును తిరిగి పొందాలనే ఆశతో ఆమె ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుబాయ్ నివాసి ధర్మేష్ భరద్వాజ్ కూడా స్కామ్‌కు గురయ్యాడు. అతను స్వచ్ఛమైన నెయ్యి బాటిల్‌కు  Dh1 నమ్మశక్యం కాని ఆఫర్‌ను బుక్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు Dh18,000 కోల్పోయాడు. ఇదిలా ఉండగా, 16 ఏళ్లుగా యూఏఈలో నివసిస్తున్న దినేష్ కుమార్ 5,030 దిర్హామ్‌లు కోల్పోయారు.

Apple Pay, WhatsApp, Google Pay వంటి చెల్లింపు యాప్‌లలో మాల్వేర్‌ను అమలు చేయడానికి స్కామర్‌లు కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML)లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని దుబాయ్‌కి చెందిన సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు కమల్ అయూబ్ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com