శిక్షణా కార్యక్రమంలో విషాదం.. ఇద్దరు సైనికులు మృతి..!!
- February 20, 2025
కువైట్: కువైట్ లో సైనిక శిక్షణా కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు సైనికులు మరణించారు. రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-సబాహ్ అమరవీరులకు సంతాపం తెలిపారు. మేజర్ సార్జెంట్ అహ్మద్ ఫర్హాన్ హరత్ , సార్జెంట్ ముసాద్ ధాహి సలేహ్ రాత్రి షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడి మరణించారు. రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అంతకుముందు, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అమరవీరులు హరత్, సలేహ్‌లకు సంతాపం తెలిపారు. అదే సైనిక ఎక్సర్ సైజులో కార్పోరల్ అన్వర్ ఖలాఫ్ రద్వాన్, కార్పోరల్ ముత్లాక్ మహ్మద్ ముబారక్ గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







