చరిత్ర పుస్తకాల్లో ‘షాబు’..వ్యక్తికి 5ఏళ్ల జైలుశిక్ష..!!
- February 20, 2025
మనామా: చరిత్ర పుస్తకాలలో మెథాంఫేటమిన్(షాబు) తీసుకొచ్చిన ఒక ఆసియా వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలుశిక్షతోపాటు BD3,000 జరిమానా విధించారు. అలాగే అతనిని శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. కాగా , ఈ తీర్పు అప్పీల్ చేసుకున్నాడు. హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఫిబ్రవరి 24న తీర్పు ఇవ్వనుంది.
అక్రమ రవాణా కోసం సైకోయాక్టివ్ పదార్థాన్ని అక్రమంగా తీసుకువచ్చినందుకు 36 ఏళ్ల వ్యక్తిని హై క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. జైలు శిక్షతో పాటు, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను జప్తు చేయాలని, శిక్ష ముగిసిన తర్వాత అతన్ని బహ్రెయిన్ నుండి బహిష్క్రించాలని కోర్టు ఆదేశించింది.
యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ ఆసియా దేశం నుండి బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా వస్తున్న పోస్టల్ ప్యాకేజీని తనిఖీ చేసిన సమయంలో ఈ కేసు బయటపడింది. ఎక్స్-రే స్కానర్ ద్వారా పార్శిల్‌ను తనిఖీలు చేయగా, రెండు చరిత్ర పుస్తకాలలో దాచబడిన పదార్థాన్ని గుర్తించాడు. వాటిని తెరిచినప్పుడు, అధికారులు 1.3 కిలోగ్రాముల బరువున్న మెథాంఫేటమిన్ ('షాబు') ను గుర్తించారు.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







