ICC ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌ బోణీ..

- February 20, 2025 , by Maagulf
ICC ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌ బోణీ..

దుబాయ్: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. శుభ్‌మ‌న్ గిల్ (101 నాటౌట్‌; 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో 229 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 46.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ (41; 36 బంతుల్లో 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (41 నాటౌట్; 47 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో రిషద్ హొస్సేన్ రెండు వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లు చెరో వికెట్ సాధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com