కస్టమ్స్ డీల్ పై సంతకాలు చేసిన ఇటలీ, బహ్రెయిన్..!!

- February 22, 2025 , by Maagulf
కస్టమ్స్ డీల్ పై సంతకాలు చేసిన ఇటలీ, బహ్రెయిన్..!!

మనామా: ఇటలీ, బహ్రెయిన్ మధ్య కొత్త కస్టమ్స్ సహకార ఒప్పందం కుదిరింది. ఈ మేరకు మనామాలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

ఇటాలియన్ కస్టమ్స్ అండ్ మోనోపోలీస్ ఏజెన్సీ (ADM) రాబర్టో అలెస్సే,  బహ్రెయిన్ కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఈ ఒప్పందాన్ని అధికారికంగా రూపొందించారు. ఈ ఒప్పందం రెండు దేశాలకు నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, సరిహద్దు నియంత్రణలను మెరుగుపరచడానికి, వ్యాపారాలు, పౌరులకు సురక్షితమైన, మరింత సమర్థవంతమైన కస్టమ్స్ విధానాలను నిర్ధారించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

ఇటలీ ఐరోపాలో బహ్రెయిన్ ముఖ్య వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉంది. ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, షిప్‌బిల్డింగ్ వంటి రంగాలు పెట్టుబడులకు ఆశాజనకమైన మార్గాలను ఈ ఒప్పందం అందిచనుంది. అవగాహనా ఒప్పందం (MOU) ప్రకారం.. జాయింట్ నాలెడ్జ్ షేరింగ్ కార్యక్రమాలు, సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు, సాంకేతిక సందర్శనలు, ఉమ్మడి సెమినార్లను నిర్వహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని పొందుపరచడం ద్వారా కస్టమ్స్ నియంత్రణలను ఆధునీకరించడం వంటి నిబంధనలు ఈ ఒప్పందంలో పొందుపరిచారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com