రియాద్ వేదికగా సమావేశమైన GCC, జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు..!!
- February 22, 2025
రియాద్: సౌదీ రాజధానిలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి), జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు సమావేశమయ్యారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ ఆతిథ్యం ఇచ్చిన సమావేశంలో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్, బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్, ఎఫ్ ఆర్డానియన్ క్రౌన్ ప్రిన్స్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు, అబుదాబి డిప్యూటీ పాలకుడు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాలస్తీనా సమస్య, గాజాలో అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై నాయకులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మార్చి 4న కైరోలో జరగనున్న అత్యవసర అరబ్ లీగ్ శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతించారు. తమ మధ్య ఉన్న బలమైన సోదర సంబంధాలను పెంపొందించడం, తమ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఈ సమావేశం కొనసాగుతుందని జీసీసీ, జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









