ఆసుపత్రిలో చేరిన పవన్ కల్యాణ్
- February 23, 2025
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసింది. ‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ సహా పలు పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ నెల చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ మరోసారి ఆస్పత్రికి వచ్చే అవకాశముంది. మరోవైపు ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నట్లు జనసేన పార్టీ అధికారిక ‘ ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది.పవన్ గత కొద్ది రోజులుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







