యాదగిరిగుట్టలో బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
- February 23, 2025
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్నారు. వారికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 11.36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామివారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు.
స్వర్ణ విమాన గోపురం విశేషాలివే..
• స్వర్ణ విమాన గోపురం ఎత్తు: 50.5 అడుగులు
• స్వర్ణ విమాన గోపురానికి ఉపయోగించిన బంగారం మొత్తం : 68 కిలోలు
• బంగారు విమాన గోపురం వైశాల్యం: 10,759 చదరపు అడుగులు
• తాపడం పనులు ప్రారంభించిన తేదీ: 1 డిసెంబరు 2024
• తాపడం కవచాల బిగింపు పనుల పూర్తి: 18 ఫిబ్రవరి 2025
• బంగారు తాపడం బిగింపు ఖర్చు: రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా)
• రాగిరేకుల తయారీ ఖర్చు: రూ.12 లక్షలు
• పనిచేసిన కార్మికులు: 50 మంది
• పనులు చేసిన సంస్థ: నవయుగ మెటల్స్
• స్వర్ణ విమాన గోపురం పనులు చేసిన సంస్థ: ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్, చెన్నై
తాజా వార్తలు
- కువైట్‌లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్‌లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







