కేరళలోని 5 కిమీ కన్నూర్ బీచ్ రన్‌లో పాల్గొన్న యూఏఈ మంత్రి..!!

- February 23, 2025 , by Maagulf
కేరళలోని 5 కిమీ కన్నూర్ బీచ్ రన్‌లో పాల్గొన్న యూఏఈ మంత్రి..!!

యూఏఈ: ప్రపంచ ఐక్యతకు సూచనగా, యూఏఈ మంత్రి ఒకరు కేరళలో ఆదివారం నిర్వహించిన రన్ లో పాల్గొన్నారు.  ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ కోసం కేరళ వచ్చిన యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రీ.. కన్నూర్ బీచ్ రన్ 8వ ఎడిషన్‌లో 5 కి.మీ పరుగులో పాల్గొన్నారు. యూఏఈ ఆధారిత VPS హెల్త్‌కేర్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షంషీర్ వాయలీల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు మంత్రి రన్ లో పాల్గొని సందడి చేశారు.   

అల్ మర్రి రన్ ముగిసాక మాట్లాడుతూ.. " సోదరుడు డాక్టర్ వయాలీల్‌తో కలిసి ఇక్కడ కన్నూర్‌లో కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ చొరవను ప్రారంభించాము.. ఈ రోజు ఇక్కడకు వచ్చి అందులో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది కేరళ ప్రజలతో కలిసి ఇక్కడ మరో పరుగు తీయాలని ఉంది." అని తెలిపారు.

యూఏఈలో దాదాపు పది లక్షల మంది కేరళీయులు నివసిస్తున్నారు.  ఈ కార్యక్రమం ప్రవాసులలో సమాజ సేవా కార్యక్రమాల గురించి అవగాహన పెంచింది.  అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి పాల్గొనడాన్ని ఈవెంట్ నిర్వాహకులు స్వాగతించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం గౌరవంగా ఉందన్నారు. అతడి రాకతో 'ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ రన్' థీమ్, స్ఫూర్తిని పెంచింది.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com