పులివెందుల లో నేత్ర వైద్యశాలను ప్రారంభించిన జగన్
- February 26, 2025
* తాత రాజారెడ్డి పేరుతో అత్యాధునిక హాస్పటల్
* 10 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం
* జగన్ చూసేందుకు భారీగా వచ్చిన జనం
* ఆనందంగా ప్రతి ఒక్కరిని పలకరించిన జగన్
* కాబోయే సీఎం అంటూ నినాదాల హోరు
పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ తన నియోజకవర్గం పులివెందులలో రెండోరోజైన నేడు రూ. 10 కోట్లతో ఆధునికీకరణ చేసిన వైయస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఆసుపత్రిని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. అనంతరం ఆయన ఆస్పత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడే ఉన్న డాక్టర్లతో ఆయన కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందించింది అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. అయితేఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ వైద్యశాలకు వైఎస్సార్ ఫౌండేషన్ స్థలం సమకూర్చడంతో పాటు సుమారు రూ. 10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి, అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఆస్పత్రిని అధునికీకరించడం విశేషం అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది అన్నారు. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఈ ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం అక్కడే ఉన్న సిబ్బందిని అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అక్కడున్న సిబ్బంది జగన్ తో సెల్ఫీలు దిగారు.
అంతకుముందుగా ఆసుపత్రిలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి నుండి బయటికి రాగానే బయట ఉన్న జన సంద్రోహాన్ని చూసి ఆయన ఆనందంగా ప్రతి ఒక్కరిని పలకరించారు. ఉన్న ప్రజలు జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నినాదాలు చేశారు. ఎక్కడున్నా వారితో ఆయన సెల్ఫీలు తీసుకుని వారిని ఆనందింపజేశారు. ఆయనతో కరచాలన చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







