ట్రంప్ ఐడియా.. ఆ కార్డు ఉంటే చాలు..!
- March 03, 2025
కొత్తగా ప్రతిపాదించబడిన గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికన్ కంపెనీలు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి అగ్రశ్రేణి US విశ్వవిద్యాలయాల నుంచి భారతీయ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి వీలు కల్పిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ బుధవారం ధనవంతులైన విదేశీయుల కోసం 'గోల్డ్ కార్డ్' ను ఆవిష్కరించారు. వారికి దేశంలో నివసించే, పని చేసే హక్కును కల్పిస్తారు. అంతే కాకుండా 5 మిలియన్ USD రుసుమును చెల్లించి పౌరసత్వం కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు.
తాము గోల్డ్ కార్డ్‌ను అమ్మబోతున్నామని ట్రంప్ ఓవల్ ఆఫీస్ ప్రకటించారు. "మీకు గ్రీన్ కార్డ్ ఉంది. ఇది గోల్డ్ కార్డ్. మేము ఆ కార్డుపై సుమారు 5 మిలియన్ USD ధరను నిర్ణయించబోతున్నాము. ఇది మీకు గ్రీన్ కార్డ్ హక్కులను ఇస్తుంది. అంతేకాకుండా ఇది పౌరసత్వానికి మార్గం అవుతుంది. ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా ధనవంతులు మా దేశంలోకి వస్తారు" అని ట్రంప్ పేర్కొన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి.
ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ముఖ్యంగా భారతదేశం నుంచి అగ్రశ్రేణి అంతర్జాతీయ ప్రతిభను USలో ఉండకుండా, పని చేయకుండా అడ్డుకుందని ట్రంప్ తెలిపారు. కొంత మంది భారతదేశం, చైనా, జపాన్ ఇతర దేశాల నుండి వచ్చి, హార్వర్డ్ లేదా వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్‌లో చదువుతున్నారు. వారికి ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. కానీ ఆ వ్యక్తి దేశంలో ఉండగలడా లేదా అనే దానిపై ఎటువంటి ఖచ్చితత్వం లేనందున ఆఫర్ వెంటనే రద్దు అవుతుందని ట్రంప్ పేర్కొన్నాడు.
దీని కారణంగా, అమెరికాను విడిచి వెళ్ళవలసి వచ్చిన చాలా మంది ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లు స్వదేశంలో విజయవంతమైన వ్యవస్థాపకులుగా మారారని ట్రంప్ వివరించారు. ఒక కంపెనీ గోల్డ్ కార్డ్ కొని ఈ రిక్రూట్మెంట్ విషయానికి ఉపయోగించుకోవచ్చని ట్రంప్ అన్నారు.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







