మక్కాలో దంచికొడుతున్న వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు..!!
- March 04, 2025
మక్కా: మక్కాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్ష సూచన నేపథ్యంలో మక్కా నగరంలోని అన్ని పాఠశాలలతో పాటు అల్-జుముమ్, అల్-కామిల్, బహ్రా గవర్నరేట్లలో విద్యార్థులకు వ్యక్తిగత తరగతులను నిలిపివేస్తున్నట్లు మక్కా విద్యా శాఖ ప్రకటించింది. "నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ నివేదిక ఆధారంగా అందరి భద్రతను దృష్టిలో పెట్టుకొని, పవిత్ర రాజధానిలోని అన్ని పాఠశాలలు, అల్-జుముమ్, అల్-కామిల్ మరియు బహ్రా గవర్నరేట్లలో తరగతులను నిలిపివేయాలని నిర్ణయించారు. తరగతులు మద్రసతి ప్లాట్‌ఫామ్ ద్వారా రిమోట్‌గా నిర్వహించబడతాయి."అని ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు ఉమ్ అల్-ఖురా విశ్వవిద్యాలయం కూడా వ్యక్తిగత తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తరగతులు రిమోట్‌గా జరుగుతాయని పేర్కొంది. ఇది నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ వాతావరణ సూచన ఆధారంగా ఉంది. మక్కా ప్రాంతంలోని అన్ని గవర్నరేట్లలోని విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయాలు, కళాశాలలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని విశ్వవిద్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







