92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం'

- March 04, 2025 , by Maagulf

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తుఫానుగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా డిజిటల్ రంగంలో కూడా చెరగని ముద్ర వేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సక్సెస్ ని రీడిఫైన్ చేసింది.

పండుగ సీజన్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, 92 సెంటర్లలోని థియేటర్లలో 50 రోజుల ప్రదర్శణను పూర్తి చేయడం ద్వారా అరుదైన ఘనతను సాధించింది. OTT ప్లాట్‌ఫారమ్‌లు ఆధిపత్యం వహించిన ఈ కాలంలో, సినిమాలు థియేటర్ లో లాంగ్ రన్  కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ సమయంలో ఈ విజయం అసాధారణమైనదిగా నిలిచింది.

సంక్రాంతికి వస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడమే కాకుండా, అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీజనల్ ఫిల్మ్ గా  నిలిచింది, డిజిటల్ కూడా రికార్డులను బద్దలు కొట్టింది. ZEE5 లో ప్రసారం అవుతున్న ఈ చిత్రం ప్లాట్‌ఫామ్‌లోని ఇతర బ్లాక్‌బస్టర్‌ల ఓపెనింగ్ వ్యూవర్షిప్ ని అధిగమించింది.

OTT లోకి వెళ్లినప్పటికీ సంక్రాంతికి వస్తున్నం థియేటర్లలో ఆదరగొడుతోందిఈ విజయం ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్ టైనర్స్ పవర్ ని చాటి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com